: అమ్మాయిల డ్రస్సులతో స్కూళ్లకు వచ్చేందుకు అబ్బాయిలకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి!
అమ్మాయిలకు మాదిరిగా పొట్టి స్కర్టులు ధరించి స్కూళ్లకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, మీ వింత కోరిక బ్రిటన్ లో తీరుతుంది. తమకు నచ్చిన స్కూలు డ్రస్ లో వచ్చి చదువుకునే వెసులుబాటును కల్పిస్తూ, బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు వేసుకునే స్కర్టులు ధరించి పాఠశాలకు రావచ్చు. అమ్మాయిలు ప్యాంట్లు, షర్టులు వేసుకోవచ్చు. పాఠశాలల్లో లింగ వివక్షను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతుండగా, మిషనరీ సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా, ప్రయోగాత్మకంగా, ఈ విధానాన్ని గుర్తించిన 80 స్కూళ్లలో అమలు చేయాలని బ్రిటన్ సర్కారు నిర్ణయించింది. స్కర్టులేసుకుని స్కూలుకు వచ్చిన అబ్బాయిల చిత్రాన్ని మీరూ చూడవచ్చు.