: ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం... 20 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం, ఓ చిన్నారికి తీవ్ర గాయాలు


దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో ఓ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు గీతా కాలనీలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఓ ఇంటిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో దుండగులు టార్గెట్ చేసిన వ్యక్తి తప్పించుకోగా, అతడి చిన్నారి సోదరుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకెళితే... గీతా కాలనీలోకి ప్రవేశించిన నలుగురు యువకులు అక్కడి ముక్తియార్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అతడి ఇంటిపై కాల్పులు జరిపారు. ఏం జరుగుంతో చూద్దామని తలుపు వద్దకు వచ్చిన ముక్తియార్ సోదరుడు 12 ఏళ్ల బాలుడు భుజంలో నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉండి కాల్పులతో చెలరేగిపోయిన నలుగురు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాల్పుల్లో గాయపడ్డ బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News