: టెస్టులా సాగుతున్న జింబాబ్వే ఇన్నింగ్స్ లో పతనం మొదలు


భారత బౌలర్లు వేస్తున్న పదునైన బంతులను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ, టెస్టు మ్యాచ్ ని తలపిస్తూ మొదలైన జింబాబ్వే ఇన్నింగ్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ మసకజ్జా, 1 పరుగు చేసిన పీటర్ మూర్ పెవీలియన్ దారి పట్టారు. భారత యువ బౌలర్ శ్రాన్ ఈ రెండు వికెట్లనూ దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం చిబాబా 9 పరుగుల వద్ద ఆడుతుండగా, సిబందా జత కలిశాడు. జింబాబ్వే స్కోరు 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు.

  • Loading...

More Telugu News