: క్షీణిస్తోన్న ఆరోగ్యం.. వైద్య పరీక్షలకూ నిరాకరిస్తోన్న ముద్రగడ
తుని ఘటనలో నిందితులని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 13మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో దీక్షను కొనసాగిస్తోన్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోన్న కాపు కార్యకర్తలు నేడు ‘చలో రాజమహేంద్రవరం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసుపత్రిలో ముద్రగడ వైద్య పరీక్షలకు సహకరించడం లేదని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.రమేష్ కిషోర్ మీడియాకు తెలిపారు. ముద్రగడతో పాటు దీక్షను కొనసాగిస్తోన్న ఆయన భార్య, కుమారుడు, కోడలు మాత్రం వైద్య పరీక్షలకు సహకరిస్తున్నట్లు డాక్లర్లు పేర్కొన్నారు. ముద్రగడ దీక్ష దృష్ట్యా ఆసుపత్రి ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.