: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలున్నాయి.. టీఆర్ఎస్‌లో చేరుతున్నాం: గుత్తా సుఖేందర్‌రెడ్డి


నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ హైదరాబాదు, సోమాజీగూడ లోని వివేక్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాము అధికార‌ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్న‌ట్లు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములం కావాల‌నే టీఆర్ఎస్‌లో చేరుతున్నామ‌న్నారు. కాంగ్రెస్‌ను వీడుతుండ‌డం తమకు బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. కాంగ్రెస్‌లోని అంతఃక‌ల‌హాల‌తో తాము మ‌నో వేద‌న‌కు గుర‌య్యామ‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కు స‌హ‌క‌రిస్తామ‌ని గుత్తా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ నాకు అప్ప‌గించిన బాధ్య‌త‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించా’న‌ని ఆయన అన్నారు. ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ త‌న‌కు రెండు సార్లు అవ‌కాశం ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News