: టీమిండియా కోచ్ పదవికి పోటెత్తిన అప్లికేషన్లు... రవిశాస్త్రి సహా 57 మంది దరఖాస్తు
టీమిండియా కోచ్ బాధ్యతలు చేపడతామంటూ పెద్ద సంఖ్యలో మాజీ క్రికెటర్లు బీసీసీఐ ముందు క్యూ కట్టారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న టీమిండియా కోచ్ పదవిని చేపడతానంటూ జట్టు డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. రవిశాస్త్రితో పాటు మరో మాజీ దిగ్గజం సందీప్ పాటిల్ కూడా కోచ్ పదవికి అప్లై చేశాడు. ఈ నెల 10తో దరఖాస్తులకు గడువు ముగిసిన నేపథ్యంలో కోచ్ పదవికి ఎంతమంది దరఖాస్తు చేశారన్న విషయంపై బీసీసీఐ నిన్న ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం మొత్తం 57 మంది క్రికెటర్లు కోచ్ పదవి చేపడతామంటూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేస్తామని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది.