: ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుమలలో వెతలు!


రద్దీ, రద్దీ... ఎటు చూసినా రద్దీ. తలనీలాలు ఇచ్చే చోట రద్దీ, క్యూ కాంప్లెక్సుల్లో రద్దీ, షెడ్డుల్లో రద్దీ, ఆఖరికి శ్రీవారి ఆలయం ముందు కూడా కిక్కిరిసిన భక్తజనం. ఇది తిరుమలలో కనిపిస్తున్న పరిస్థితి. జన సంద్రంతో తిరుమల గిరులు ఇసుకేస్తే రాలనంత రద్దీతో కనిపిస్తుండగా, స్వామివారి దర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పగలు ఎండలో, రాత్రి చలిలో పడరాని పాట్లు పడుతూ, స్వామివారి క్షణకాల దర్శనం కోసం దాదాపు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలపై నిరీక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో కనిపించే రద్దీ కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలోని వారికి అన్నపానీయాలు అందిస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ సాధ్యమైనంత త్వరగా దర్శనం చేయిస్తామని పేర్కొన్నారు. కాగా, తిరుమలలో మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News