: నల్లధనం విషయంలో కేంద్రం చర్యలపై దేశం మొత్తం అసంతృప్తిగా ఉంది: రాందేవ్ బాబా
బీజేపీ రెండేళ్ల విజయోత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ ఊహించని విధంగా రాందేవ్ బాబా నుంచి కేంద్రం చర్యలపై అసంతృప్తి వ్యక్తమయింది. దేశం దాటిన నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడంలో కేంద్రం చేపట్టిన చర్యలపై దేశం మొత్తం అసంతృప్తిగా ఉందని రాందేవ్ బాబా తెలిపారు. ఛండీగఢ్ లో ఆయన మాట్లాడుతూ, చట్టాలు చేసే నేతలు పార్లమెంటులో ప్రసంగాలు వినడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే నల్లధనం స్వదేశం రాలేదని ఆయన తెలిపారు. అదే సమయంలో ప్రాజెక్టులు చేపట్టడంలో, అవినీతిని అరికట్టడంలో కేంద్రం బాగా పని చేస్తోందని కితాబునిచ్చారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీల పనితీరు అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు.