: నిన్ను చూసి దేశం గర్విస్తోంది...సైనాకు అభినందనల వెల్లువ


ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని గెలుచుకున్న సైనా నెహ్వాల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 'నిన్ను చూసి దేశం గర్విస్తోంద'ని ప్రధాని నరేంద్ర మోదీ సైనాకు ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. అలాగే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా మరోసారి దేశాన్ని గర్వించేలా చేసిన సైనాకు అభినందనలని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు కేసీఆర్, ఫడ్నవీస్, అనందీ బెన్ పటేల్, కేంద్రమంత్రులు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, సినీ నటి సోనాక్షీ సిన్హా, మాజీ క్రికెటర్లు సచిన్, కుంబ్లే, టీమిండియా ఆటగాళ్లు ధావన్, యువరాజ్ సింగ్ సైనాను అభినందించారు.

  • Loading...

More Telugu News