: రాజ్యసభ ఎన్నికల్లో అవినీతి... రీ ఎలక్షన్ కు డిమాండ్ చేసిన భూపీందర్ సింగ్ హూడా


హర్యానాలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందని, ఓట్ల కౌంటింగ్ తప్పుల తడకగా సాగిందని ఆరోపిస్తూ, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా రీ ఎలక్షన్ కు డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేలు కలాన్ని వాడేందుకు ఒప్పుకోలేదని, దీనిపై ఫిర్యాదు చేయనున్నామని ఆయన అన్నారు. కాగా, స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన న్యాయవాది ఆర్కే ఆనంద్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్ చంద్ర విజయం సాధించగా, ఓట్ల లెక్కింపులో అక్రమాలు సాగాయని, తమ పార్టీకి చెందిన 14 మంది ఓట్లను అన్యాయంగా చెల్లవని చెప్పారని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల ఓట్లూ ఆనంద్ కే పడ్డాయని, కానీ మూడు మాత్రమే చెల్లాయని ఎన్నికల అధికారులు ప్రకటించడం వెనుక బీజేపీ హస్తముందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News