: ముక్కూ మొహం తెలియని వారికి పద్మశ్రీ అవార్డులు: దర్శకరత్న దాసరి


తెలుగు సినీ పరిశ్రమలో టాలెంట్ కు గుర్తింపు లేదని, అధిక సిఫార్సులు వచ్చిన వారికి అవార్డులు ఇస్తున్నారని దర్శకరత్న దాసరి నారాయణరావు విమర్శించారు. 'మా' తరఫున సీనియర్ నటులు కైకాల, జమునలకు సన్మానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముక్కూ మొహం తెలియని వారికి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారని, కైకాల సత్యనారాయణ వంటి వారు ఏం పాపం చేశారని వారికి ప్రతిష్ఠాత్మక అవార్డులు దగ్గర కాలేదని ప్రశ్నించారు. సినీ నటుల సంక్షేమంపై గతంలో 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ కు ఎంతో వివరించానని, అప్పట్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఏ పథకాలూ అమలు కావడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు జీవితం గడవక ఇబ్బందులు పడుతున్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

  • Loading...

More Telugu News