: సీనియర్లకు గౌరవమే ఇవ్వడం లేదు: కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీనియర్ నటులకు ఎంతమాత్రమూ గౌరవం దక్కడం లేదని ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున కైకాల, జమునలకు సత్కారం జరుగగా, ఆయన మాట్లాడారు. ఏ సినిమా వేడుక, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియడం లేదని అన్నారు. మిగిలిన సీనియర్ నటులను మంచి మనసుతో అన్ని కార్యక్రమాలకూ ఆహ్వానిస్తే మంచిదని సూచించారు. 'మా' అసోసియేషన్ మంచి కార్యక్రమాలను చేపడుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావుతో పాటు నటీనటులు రాజేంద్రప్రసాద్, విష్ణు, నరేష్, ఎస్వీ కృష్ణా రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.