: పాకిస్థాన్ వద్దు, కాశ్మీర్ ను మాత్రం వదలబోమంటున్న ఐఎస్ఐఎస్!


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ కన్నా, కాశ్మీర్ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) వెల్లడించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఆయిల్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టయిన మహమ్మద్ సిరాజుద్దీన్ పై ఎన్ఐఏ వేసిన చార్జ్ షీట్లో ఈ విషయం ఉంది. చార్జ్ షీట్లో భాగంగా ఉగ్రవాదులు, సిరాజుద్దీన్ మధ్య జరిగి చాటింగ్ వివరాలను ఎన్ఐఏ ప్రస్తావించింది. "కాశ్మీరు ఐఎస్ దే, ఇస్లామిక్ స్టేట్ లో భాగమే ఇన్షాఅల్లా" అని ఉందని, వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ మరణించిన నవంబర్ 17, 2015న ఐఎస్ సభ్యులు పండగ చేసుకున్నారని తెలిపింది. సింఘాల్ మరణాన్ని ఐఎస్ కు శుభవార్తగా సిరాజుద్దీన్ అభివర్ణించాడని ఎన్ఐఏ వెల్లడించింది. కాశ్మీర్ లోని ఉగ్రవాదుల ప్రాంతానికి ప్రత్యేక కరెన్సీని సిరాజుద్దీన్ తయారు చేశాడని 'ఐఎస్ వెల్ కం ఇన్ కాశ్మీర్' అని రాసిన 20 రూపాయల నోట్లను విడుదల చేశారని తెలిపింది.

  • Loading...

More Telugu News