: హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్... ఘనస్వాగతం పలికిన నేతలు
వారం రోజులకు పైగా సాగిన అమెరికా పర్యటనను ముగించుకుని ఈ తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ భారీ ఎత్తున కార్యకర్తలతో వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి అమెరికా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడినట్టు తెలిపారు. వారితో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నినాదాలతో ఎయిర్ పోర్టు సందడిగా మారింది.