: దేశమంతా గౌరవిస్తుంటే, ఇక్కడ తిట్టించుకోవడం బాధేస్తోంది: చంద్రబాబు


దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి పాటుపడుతున్న తనను, దేశమంతా గౌరవిస్తుంటే, ఇక్కడ మాత్రం నేరస్తులు, చోటా రాజకీయ నాయకులతో వ్యక్తిగత విమర్శలకు గురికావడం, వారితో తిట్టించుకోవడం తనకు బాధను కలిగిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు వైకాపా నేతల వైఖరిని, ఆ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న బూటకపు ప్రచారాన్ని గమనిస్తున్నారని, వారే జగన్ కు బుద్ధి చెబుతారని, తనను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని నిప్పులు చెరిగారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు రాజకీయ ముసుగులో తప్పించుకోవాలని చూస్తే, అది తాత్కాలికమే అవుతుందని, వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని అన్నారు. తనను విమర్శించే ముందు వారు చేసిన నేరాలను, వారిపై ఉన్న కేసులను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వాల్సిన బాధ్యతను ఏపీలో విపక్షం విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News