: ఒంగోలు వరకూ వచ్చి ఆగిపోయిన నైరుతి!
దాదాపు వారం రోజులు ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాల తొలి దశ వర్షాలు ముగిసినట్టేనని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాలు కోస్తాలో ఒంగోలు వరకు, రాయలసీమలో అనంతపురం వరకూ వచ్చి ఆగిపోయాయని, ఇవి కదలాలంటే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాల్సిందేనని, మరో రెండు రోజుల్లో అల్పపీడనం రాకుంటే, తిరిగి ఎండలు మండుతాయని వివరించారు. గాల్లోని తేమ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడుతున్నా, అవి రుతుపవనాలు కాదని తెలిపారు. బంగాళాఖాతంలో ఈశాన్య ఉపరితల ఆవర్తనం ఏర్పడినప్పటికీ, అది బలపడి అల్పపీడనం అయ్యే వాతావరణం కనిపించడం లేదని వివరించారు.