: మా నాన్నను అరెస్టు చేశారు... కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు: ముద్రగడ కుమారుడి హౌస్ మోషన్ పిటిషన్


కాపు రిజర్వేషన్ ఐక్య ఉద్యమ వేదిక నేత ముద్రగడ పద్మనాభం అరెస్టుపై ఆయన కుమారుడు బాలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ లో తన తండ్రిని అరెస్టు చేశారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టు చూపడం లేదని పిటిషన్ లో బాలు పేర్కొన్నారు. అడిగితే 144 సెక్షన్ అని చెబుతున్నారని, కనీసం తమ ఇంటికి బంధువులను కూడా రానివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. కనీసం తమ ఊర్లో పిల్లలను కూడా బయటకు వెళ్లనివ్వడం లేదని పిటిషనర్ వాపోయారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కాగా, దీనిపై విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News