: ఉదయం ఉత్తర్వులు ఇచ్చారు... సాయంత్రానికి మాట మార్చేశారు!


టీచర్లు కూడా స్కూళ్లకు జీన్స్ ధరించకుండా వెళ్లాలని ఆదేశిస్తూ హర్యానా రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేమీ జరగలేదని తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, జీన్స్ ధరించకూడదని తామెప్పుడూ అనలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులేమీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఒక వేళ అలా ఏదైనా జరిగి ఉంటే దానిని వెంటనే వెనక్కు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీంతో విద్యాశాఖ ఉత్తర్వుల కంటే ముఖ్యమంత్రి మాటకే విలువ ఎక్కువని ఎప్పట్లా స్కూలుకు జీన్స్ వేసుకుని వెళ్లవచ్చని టీచర్లు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News