: నల్లజాతి క్రికెటర్లకు న్యూజిలాండ్ లో రక్షణ లేదు: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫ్రాంక్లిన్ రోజ్


వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఫ్రాంక్లిన్ రోజ్ న్యూజిలాండ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆక్లాండ్ లో ఆక్లాండ్ యూనివర్సిటీ క్రికెట్ క్లబ్ తో ఐదేళ్లక్రితం ఏడాది ఒప్పందంతో 2011లో న్యూజిలాండ్ చేరుకున్న ఫ్రాంక్లిన్ వీసా గడువు 2012లో ముగిసిపోయింది. అయినప్పటికీ ఆయన దేశం విడిచి వెళ్లకపోవడంతో 2014లో ఆయన అక్రమంగా దేశంలో ఉంటున్నారని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏడు నెలలపాటు జైలులో ఉంచారు. అనంతరం ఆయనకు దేశబహిష్కరణ శిక్ష విధించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్ లో భయంకరమైన జాతి వివక్ష కొనసాగుతోందని అన్నారు. నల్లజాతీయులకు న్యూజిలాండ్ ఏమాత్రము సురక్షితమైన దేశం కాదని చెప్పారు. ఏడు నెలల శిక్షా కాలంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరు చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. వారు గాయపరిచిన తీరుకు తన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిందని ఆయన వెల్లడించారు. నల్లజాతి క్రికెటర్లకు న్యూజిలాండ్ ఎంత మాత్రం సురక్షిత ప్రదేశం కాదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News