: యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: పారికర్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని త్వరలో పార్టీ ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. యూపీలోని ఘజియాబాద్ లో బీజేపీ నిర్వహించిన వికాసపర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజాగా సంభవించిన మధుర అల్లర్ల విషయంలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ విఫలమైందని అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు మార్పును చూపిస్తారని ఆయన తెలిపారు. ఎన్డీయే అధికారం చేపట్టిన రెండేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 59 పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ప్రధాని పిలుపుకు స్పందించి 1.5 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారని ఆయన చెప్పారు.