: ముద్రగడ వద్దకు పయనమైన బొత్స, అంబటి సహా వైసీపీ నేతల అరెస్ట్


రాజమహేంద్రవరంలోని ఆసుప‌త్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తోన్న కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను ప‌రామ‌ర్శించేందుకు పయనమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడి ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కి త‌ర‌లించారు. ముద్ర‌గ‌డ‌ను క‌ల‌వ‌నివ్వ‌కుండా త‌మ‌ను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News