: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విలువలు హరిస్తున్నాయి: చుక్కా రామయ్య
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ప్రవర్తన, ఫీజుల పెంపుకు నిరసనగా హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు చేపట్టిన ధర్నాకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సంఘీభావం తెలిపారు. ఇందిరాపార్కులో ధర్నా చేస్తున్న వారిని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ప్రవర్తన విలువలు హరించేలా ఉందని అన్నారు. ఫీజుల పెంపుకు ఒక విధానం అంటూ లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల కల్పన పేరిట తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్య చాలా ఖరీదైన వ్యవహారం అయిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజుల పధ్ధతిని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.