: సత్తా చాటుతున్న కొత్త కుర్రాళ్లు... హాఫ్ సెంచరీ దాటకుండానే మూడు జింబాబ్వే వికెట్లు డౌన్


అంతా కొత్త కుర్రాళ్లే వెళ్లారు... ఏం చేస్తారో, ఏమోనన్న భయం బీసీసీఐని వెంటాడింది. అదే సమయంలో ప్రత్యర్థి పసికూన అయినా తన గెలుపు మంత్రం ఛేజింగ్ కే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఓటేశాడు. అయితే అందరి అంచనాలను తిప్పికొడుతూ కొత్త కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. జింబాబ్వే రాజధాని హరారేలో కొద్దిసేపటి క్రితం మొదలైన తొలి వన్డేలో టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా... కెప్టెన్ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన కొత్త బౌలర్లు వరుసగా జింబాబ్వే వికెట్లు తీస్తున్నారు. 13.1 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన భారత కుర్రాళ్లు జింబాబ్వే టాపార్డర్ ను పెవిలియన్ చేర్చారు. 15 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులిచ్చిన భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు. కుర్రాళ్లలో ధావల్ కులకర్ణితో పాటు బరీందర్ శ్రాన్, జస్ ప్రీత్ బుమ్రా తలో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.

  • Loading...

More Telugu News