: ఫీ‘జులుం’ నశించాలి.. ప్రయివేటు స్కూళ్ల దోపిడీపై హైదరాబాద్లో తల్లిదండ్రుల ఆందోళన
నర్సరీలో పిల్లలను చేర్పించాలంటే వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఏడాదికేడాది ఫీజులు పెంచుకుంటూ పోతూ తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. మెరుగైన, నాణ్యమైన విద్యనందిస్తున్నామంటూ హైదరాబాద్లో జరుగుతోన్న ఈ విద్యా వ్యాపారంపై తల్లిదండ్రులు పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద తల్లిదండ్రులు ప్లకార్డులను పట్టుకొని ఆందోళనకు దిగారు. చదువుకోవాలా.. చదువు కొనాలా..? అని ప్రశ్నిస్తున్నారు. చెట్లను రక్షించండి, నీటిని రక్షించండి, తల్లిదండ్రులనూ రక్షించండి అంటూ నినదిస్తున్నారు. యాజమాన్యాలకు బెంజి కార్లా..? తల్లిదండ్రులకు గంజి నీళ్లా..? అంటూ ప్లకార్డులను చూపెడుతున్నారు. స్కూళ్లపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫీ‘జులుం’ నశించాలని కోరుకుంటున్నారు.