: ముద్రగడను పరామర్శించేందుకు బొత్స, అంబటి సహా వైసీపీ నేతలు పయనం
రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తోన్న కాపు నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు మరికాసేపట్లో వైసీపీ నేతలు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం బయలుదేరనున్న వైసీపీ బృందంలో బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబుతో పాటు పలువురు నేతలు ఉన్నారు. కాపు సామాజిక వర్గం చేస్తోన్న ఉద్యమానికి మద్దతు పలకాలంటూ కొన్ని రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రతిపక్షనేతలందర్నీ కలసిన విషయం తెలిసిందే.