: ముద్రగడ ఒప్పుకుంటే, తుని కేసును సీబీఐకి అప్పగిస్తాం: చినరాజప్ప
తుని ఘటనపై హోం మంత్రి చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించినట్టు తుని ఘటన కేసును సీబీఐ విచారణకు అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చినరాజప్ప తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, తుని ఘటన కేసులో సీఐడీ బాగా పని చేస్తోందని కితాబునిచ్చారు. అయితే జగన్ చేసిన ఆరోపణల ప్రకారం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ముద్రగడ ఒప్పుకోవాలని ఆయన సూచించారు. ముద్రగడ అంగీకరిస్తే సీబీఐకి ఈ కేసును అప్పగిస్తామని ఆయన తెలిపారు.