: గోవా సెక్స్ రాకెట్ లో మోడల్స్, నటీమణులు
మహారాష్ట్ర, గోవాల్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ లో మోడల్స్, సినీ నటీమణులకు సంబంధమున్నట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఈ సెక్స్ రాకెట్ కు సంబంధించి కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్తీక్ కశ్యప్ మాట్లాడుతూ, పనాజీ శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. అతని ఇంటి నుంచి క్లయింట్స్, నటీమణులు, మోడల్స్ గురించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. అతడి ఇంట్లో దొరికిన ఆధారాల్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన చాలా వివరాలు ఉన్నాయన్నారు. ఆనంద్ కుమార్ దగ్గర పనిచేస్తున్న మరో నలుగురిని కూడా అరెస్ట్ చేశామని, ముగ్గురు మహిళలను కాపాడామని ఆయన చెప్పారు.