: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేకు తెల్లరేషన్ కార్డు!


నిరుపేదలకు ఉద్దేశించిన తెల్లరేషన్ కార్డు తీసుకున్న వారి జాబితాలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే కూడా చేరిపోయారు. దీంతో సదరు ఎమ్మెల్యేను ఆ జాబితాలో చేర్చిన అధికారులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. స్థానిక తహశీల్దార్ తో పాటు రెవెన్యూ, ప్రజాపంపిణీ శాఖ అధికారులను కూడా తొలగించారు. కాగా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి జాబితాలోకి ఎక్కిన ఎమ్మెల్యేను కిషన్ భగత్ గా గుర్తించారు. కాగా, ఇదే రాష్ట్రానికి చెందిన ఒక ఇంజనీర్ కు కూడా తెల్లరేషన్ కార్డును అధికారులు మంజూరు చేసిన విషయం కూడా వెలుగుచూసింది. ఎమ్మెల్యేకు, ఒక ఇంజనీర్ కు ఈ విధంగా తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయడంపై జమ్మూలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

  • Loading...

More Telugu News