: ఢిల్లీ అసెంబ్లీలో బెంచ్ ఎక్కిన బీజేపీ ఎమ్మెల్యే...‘క్లిక్’మనిపించిన సభ్యులు


పాఠం అప్పజెప్పకపోతేనో, అల్లరి చేస్తుంటేనో... విద్యార్థిని సరిదిద్దేందుకు గాను అతనితో గోడకుర్చి వేయించడమో, బెంచ్ పై నిలబెట్టడమో చేస్తుంటారు టీచర్లు. అయితే... ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన అలాంటి దృశ్యాన్నే తలపించింది. ఢిల్లీ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా అసెంబ్లీలో బెంచ్ ఎక్కారు. ఎందుకంటే, ట్యాంకర్ల స్కాం గురించి నిరసన వ్యక్తం చేసేందుకు ఆయన ఆమార్గం ఎంచుకున్నారు. విజేంద్ర గుప్తా ఉన్నపళంగా బెంచ్ పైకి ఎక్కడంతో స్పీకర్, ఇతర సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈవిధంగా నిరసన తెలియజేసిన వారిని తాను ఇంతవరకూ చూడలేదంటూ స్పీకర్ రామ్ నివాస్ మండిపడ్డారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్పీకర్ మందలించినప్పటికీ విజేంద్ర గుప్తా ఏమాత్రం తగ్గలేదు. ఆ సమయంలో సభలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఉండటం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్యే బెంచ్ పై ఎక్కడాన్ని సహ సభ్యులు కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసుకోగా, మరికొందరు ఫొటోలు తీసుకోవడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News