: కలకలం రేపుతున్న ఐఎస్ ‘హిట్ లిస్ట్’... జాబితాలో 7,800 మందికి పైగా అమెరికన్లు


ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తాజాగా విడుదల చేసిన ‘హిట్ లిస్ట్’ కలకలం రేపుతోంది. దాదాపు 8 వేల మందికి పైగా వ్యక్తులతో కూడిన జాబితాను విడుదల చేసిన ఆ సంస్థ... వారందరినీ చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. చిరునామాలు, ఈ-మెయిల్ అడ్రెస్ లతో కూడిన సమగ్ర వివరాలతో జాబితా విడుదల చేసిన ఐఎస్ ముష్కరులు... జాబితాలోని వారిని చంపేయండంటూ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. జాబితాలో మొత్తం 8,318 మంది వ్యక్తుల పేర్లుండగా, వారిలో 7,848 మంది అమెరికన్లు ఉన్నారు. ఇక జాబితాలో 312 మంది కెనడా, 39 మంది బ్రిటన్, 69 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు. ఇక మిగిలిన వారిలో బెల్జియం, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు చెందిన వారున్నారు. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఒక్కరి పేరు కూడా లేదు.

  • Loading...

More Telugu News