: శాకాహార గుజరాత్ లో 40 శాతం మంది మాంసాహారులేనట


దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజల ఆహార నియమాలను పరిశీలిస్తే... గుజరాత్ శాకాహార రాష్ట్రంగా పేరుగాంచింది. అయితే ఇకపై ఆ రాష్ట్రానికి భవిష్యత్తులో ఆ ట్యాగ్ లైన్ వర్తించదేమో. ఎందుకంటే శాకాహారాన్ని వీడి మాంసాహారం బాట పడుతున్న ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతోందట. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2014లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ ఆసక్తికర విషయాలను కళ్లకు కడుతోంది. ఈ నివేదిక ప్రకారం శాకాహార రాష్ట్ర ట్యాగ్ లైన్ ను తగిలించుకున్న గుజరాత్ లో ఉన్న శాకాహారుల సంఖ్య కేవలం 61.80 శాతం మాత్రమేనట. మిగలిన 39.20 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటున్నారట. వెరసి ఆ రాష్ట్రంలో క్రమంగా మాంసాహారుల సంఖ్య పెరుగుతోందని ఆ నివేదిక చెబుతోంది.

  • Loading...

More Telugu News