: కాబూల్ లో భారత మహిళను కిడ్నాప్ చేసిన తాలిబన్లు


ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు ఇంకా స్వైర విహారం చేస్తూనే ఉన్నారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో నిన్న భారత సంతతికి చెందిన ఓ మహిళను ఉగ్రవాదులు అపహరించారు. స్వచ్ఛంద సంస్థ అగా ఖాన్ ఫౌండేషన్ లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన జుదిత్ డిసౌజా అనే మహిళ కాబూల్ కు తరలివెళ్లింది. నిన్న సహోద్యోగులతో కలిసి ఫౌండేషన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళుతున్న క్రమంలో డిసౌజా సహా మొత్తం సిబ్బందిని తాలిబన్లు అపహరించారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడి భారత రాయబార కార్యాలయం అఫ్ఘన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. వీలయినంత త్వరలో డిసౌజా సహా కిడ్నాప్ నకు గురైన వారందరిని విడిపించేందుకు యత్నిస్తున్నట్లు అఫ్ఘన్ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News