: సీబీఐ కార్యాలయంలో హిమాచల్ సీఎం... అక్రమాస్తుల కేసులో వరుసగా రెండో రోజు విచారణకు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విచారణ పర్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వీరభద్ర సింగ్ పై కేసు నమోదు చేసిన సీబీఐ... విచారణకు హాజరుకావాలని ఆయనకు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న సీబీఐ కార్యాలయానికి వెళ్లిన ఆయనపై సీబీఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా నేడు కూడా విచారణకు రావాలన్న సీబీఐ అధికారుల ఆదేశాలతో నేటి ఉదయం ఆయన వరుసగా రెండో రోజు సిబీఐ విచారణకు హాజరయ్యారు.