: బీహార్ లో గూండారాజ్... పాట్నాలో పట్టపగలే విద్యార్థి కిడ్నాప్


బీహార్ లో శాంతిభద్రతల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. గతంలో ఆ రాష్ట్రంలో గూండారాజ్ పాలన సాగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తగా, గూండారాజ్ ను సమూలంగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించి అధికారం చేపట్టిన నితీశ్ కుమార్ పాలనలోనూ తాజాగా గూండాలు దాదాగిరీ చేస్తున్నారు. ఈ నెల 7న బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సదరు కిడ్నాప్ దృశ్యం... ఘటనాస్థలికి సమీపంలోని ఓ భవనంపై వెలసిన సీసీ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకెళితే... ఓ బైక్ పై ముగ్గురు విద్యార్థులు వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన కారు వారి పక్కనే ఆగింది. దీంతో బాధిత విద్యార్థులు బైక్ ను ఆపగానే.. కారులో నుంచి దిగిన దుండగులు విద్యార్థులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. బైక్ పై వెనుక కూర్చున్న విద్యార్థిని కిందకు లాగేసి కారులో ఎక్కించుకున్నారు. దుండగుల స్వైర విహారంతో నిశ్చేష్టులైన కిడ్నాప్ అయిన విద్యార్థి స్నేహితులు చూస్తూ నిలుచుండటం మినహా ఏమీ చేయలేకపోయారు.

  • Loading...

More Telugu News