: రైతులను నిండా ముంచిన సూపర్ అగ్రి సీడ్స్... ఆఫీస్ కు తాళం వేసి అన్నదాతల ఆందోళన


విత్తనం పేరిట పంటను సేకరించిన సూపర్ అగ్రి సీడ్స్ అన్నదాతలను నిండా ముంచేసింది. ఏడాదిగా విత్తనాలను సేకరించిన ఆ సంస్థ కోట్లాది రూపాయలను రైతులకు చెల్లించలేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రైతుల నుంచి పంటను సేకరించిన ఆ సంస్థ బకాయిలు కోట్లకు చేరుకున్నాయి. ఏడాదిగా డబ్బు చెల్లించని సదరు సంస్థ తీరుపై అనుమానం వచ్చిన అన్నదాతలు నేటి ఉదయం హైదరాబాదు చేరుకుని సంస్థ కార్పొరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కంపెనీ కార్యాలయానికి తాళం వేసిన రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News