: ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ... చికిత్సకు ససేమిరా అంటున్న వైనం
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. తుని విధ్వంసకారుల పేరిట పోలీసులు అరెస్ట్ చేసిన కాపులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులను ఎత్తేయాలన్న డిమాండ్లతో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంటిలో ముద్రగడ నిన్న ఉదయం ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు కాపు నేతను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనే ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షను విరమించేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. చికిత్స అందించేందుకు వైద్యులు చేస్తున్న యత్నాలను కూడా ఆయన అడ్డుకుంటున్నారు.