: తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం... భారీగా ఎగసిపడుతున్న మంటలు


తిరుమలలో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో చోటుచేసుకున్న ఈ ప్రమాదం కారణంగా అక్కడ భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లతో అక్కడకు హుటాహుటిన తరలివెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగల కారణంగా అగ్నిమాపక సిబ్బందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News