: ఎయిరిండియా బుకింగ్స్ బ్యాడ్... అమ్మినా దానిని ఎవరూ కొనరు!: అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు


ఎయిరిండియా పని తీరుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఇతర విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిర్ ఇండియా బుకింగ్స్ బ్యాడ్ అని అన్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఎయిరిండియాను అమ్మకానికి పెట్టినా ఎవరూ కొనరని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా 50 వేల కోట్ల రూపాయల నష్టాల్లో మునిగి ఉందని ఆయన చెప్పారు. అందుకే దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారని, అలాగే ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులు ఉపసంహరించే ఆలోచన కూడా కేంద్రానికి లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో ఎయిరిండియా మంచి సంస్థ అని కితాబునిచ్చారు. అందుకే ఎయిరిండియాకు యూపీఏలా బెయిల్ అవుట్ ఇవ్వమని తెలిపారు. ఎయిరిండియా నష్టాల నుంచి గట్టెక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిరిండియాను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రజాధనాన్ని మాత్రం అందులో పెట్టుబడిగా పెట్టమని ఆయన స్పష్టం చేశారు. వేరే విధంగా దానిని నష్టాల బాట నుంచి బయటకు తీసుకు వస్తామని, ఈ మేరకు తాము ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News