: 'ఉడ్తా పంజాబ్'కు మద్దతు ఇస్తూ...సెన్సార్ బోర్డుకు చురకలు వేసిన రాజమౌళి


'ఉడ్తా పంజాబ్' సినిమాకు సెన్సార్ అభ్యంతరాలు చెప్పడంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి మండిపడ్డాడు. 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్: ఎంటర్‌టైన్‌మెంట్ 2015' అవార్డును అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన రాజమౌళి మాట్లాడుతూ, ఆరేడుగురు లేదా పదిమంది కలసి మొత్తం జాతికి ఏది మంచో ఏది చెడో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించాడు. తనకు లేదా తన కుటుంబానికి ఏది మంచో, ఏది చెడో ఓ వ్యక్తి నిర్ణయించగలడు కానీ, ఒక సమాజం మొత్తానికి ఏది కావాలో, అలాగే దేశం ఏది చూడాలో, ఏది చూడకూడదో కేవలం కొద్దిమంది నిర్ణయించలేరని స్పష్టం చేశాడు. తన మద్దతు 'ఉడ్తా పంజాబ్' సినిమా యూనిట్ కేనని తెలిపాడు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 90 కట్‌ లు చెప్పడాన్ని రాజమౌళి విమర్శించాడు. తాను ఒక దర్శకుడినని కాబట్టి తన మద్దతు దర్శకులకే ఉంటుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News