: తెలంగాణ సీఎస్ కు లేఖ రాయలేదు: ఏపీ సీఎస్ టక్కర్
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లోని బ్లాకులు అప్పగిస్తామని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మకు ఎలాంటి లేఖ రాయలేదని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఏపీ సచివాలయ బ్లాకులు తెలంగాణ సీఎస్ కు అప్పగిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయని అన్నారు. అవన్నీ అవాస్తవాలని ఆయన తెలిపారు. తాము ఎలాంటి లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు.