: 2019లో టీడీపీ సీఎం అభ్యర్థి నారా లోకేష్: కారెం శివాజీ
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ అని ఎస్సీఎస్టీ సెల్ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, టీడీపీని కార్యకర్తల స్థాయిలో బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చాలా కష్టపడుతున్నారని అన్నారు. ఆయన చొరవతోనే టీడీపీ జాతీయ స్థాయి పార్టీగా కొత్త రూపం సంతరించుకుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆయనను బరిలో దించుతామని ఆయన తెలిపారు.