: నవ్యాంధ్రకు తరలిరానున్న మరో ప్రభుత్వ కార్యాలయం
నవ్యాంధ్రకు మరో ప్రభుత్వ కార్యాలయం తరలిపోనుంది. ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఏపీ రవాణా శాఖ కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ నెల 27 నాటికి హైదరాబాద్ నుంచి సిబ్బంది తరలింపు పూర్తవుతుందని చెప్పారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఈ కార్యాలయం ఏర్పాటుకు పూజా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.