: గుండెను బ్యాగులో పెట్టుకుని ఏడాదికిపైగా బతికేశాడు!


గోపీచంద్ నటించిన సినిమా 'ఒక్కడున్నాడు' గుర్తుందా? అందులో విలన్ మహేష్ మంజ్రేకర్ గుండె జబ్బుతో బాధపడుతూ గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కృత్రిమ గుండెను బ్యాగులో పెట్టుకుని బతికేస్తుంటాడు. అచ్చం అలాగే అమెరికాలోని మిచిగన్ స్టేట్ లో స్టాన్ లార్కిన్, అతడి అన్న డోమినిక్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నారు. వీరి గుండె పని చేస్తూ పని చేస్తూ ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు. అది ఫలానా క్షణం అని ఎవరూ చెప్పలేరు. దీంతో వైద్యులు వారికి సర్జరీ చేసి గుండె స్థానంలో 'సిన్ కార్డియో' అనే కృత్రిమ గుండెను అమర్చారు. ఇది నిత్యం వారితో ఉండాల్సిందే. 6 కేజీల బరువుండే 'సిన్ కార్డియో' కృత్రిమ గుండె మెషీన్ ఓ బ్యాగులో పెట్టి వారిద్దరి వీపులకి తగిలించారు. అయితే, కొన్నాళ్లకే డోమినిక్ కు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగడంతో ఆయన ఎలాంటి సమస్య లేకుండా జీవిస్తున్నాడు. లార్కిన్ కు మాత్రం గుండె దొరకలేదు. దీంతో ఈ మెషీన్ తో 555 రోజులపాటు సహజీవనం చేశాడు. అసలే కృత్రిమ గుండెతో జీవనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అయినప్పటికీ లార్కిన్ బాస్కెల్ బాల్ ఆడి వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తాజాగా ఓ దాత గుండె దొరకడంతో మే 9న అతనికి హార్ట్ సర్జరీ చేశారు. అనంతరం అతనిని పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉంచారు. తాజాగా ఆయన కోలుకున్నాడు.

  • Loading...

More Telugu News