: అనుష్క శర్మకు 'సుల్తాన్' దర్శకుడి కాంప్లిమెంట్స్


బాలీవుడ్ అందాలతార అనుష్క శర్మ డెడికేషన్ కి తాను ఫిదా అయిపోయానని 'సుల్తాన్' దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెలిపాడు. 'సుల్తాన్' సినిమా కోసం అనుష్క సన్నద్ధమైన తీరు తనను బాగా ఆకట్టుకుందని అన్నాడు. పూర్తి శాకాహారి అయిన అనుష్క, శక్తిని పుంజుకునేందుకు ఒకరి వద్ద, కండలు పెంచేందుకు మరొకరి వద్ద, రెజ్లింగ్ కోసం ఇంకొకరి వద్ద... ఇలా ముగ్గురు శిక్షకుల దగ్గర ఆరు వారాలపాటు ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా కఠిన శిక్షణ తీసుకుందని ఆయన చెప్పాడు. ఈ ఆరు వారాల్లో ఆమె ఏం నేర్చుకుంటుంది అని అనుకున్నానని, అయితే, కఠోర శ్రమతో ఆమె అద్భుతం చేసిందని అన్నాడు. ఆమె అభినయం, డైలాగ్ డిక్షన్ అద్భుతంగా వున్నాయని, సినిమాలో ఆమె పాత్ర అందరికీ నచ్చుతుందని ఆయన అన్నాడు.

  • Loading...

More Telugu News