: బాలికల సంరక్షణ గృహంలో దారుణం.. 12 మంది బాలికలపై సంరక్షణాధికారి వికృత చేష్టలు
ఢిల్లీలోని ఓ బాలికల సంరక్షణ గృహంలో అధికారిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి అక్కడి 12 మంది బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికలకు సంరక్షకుడిగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాడాల్సిందిపోయి రాక్షసుడిలా వారిని వేధించాడు. ఎనిమిది నుంచి పదేళ్లలోపు వయసు ఉన్న బాలికలపై తన కామవాంఛను తీర్చుకున్నాడు. బాలికలు ఇన్ఫెక్షన్ కు గురికావడంతో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోన్న మీనా అనే కామాంధుడికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. బాలికల సంరక్షణాధికారిగా ప్రభుత్వం ఆయనను నియమించింది. బాలికల సంరక్షణాధికారిగా బాలికలు ఉండే గృహానికి వెళ్లిన అతడు, ఈనెల 2న 12 మంది బాలికలను ఒక్కొక్కరినీ గదిలోకి పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికల చేతులు కట్టేసి మరీ ఈ నీచానికి ఒడిగట్టాడు. తాను బాలికలపై లైంగిక దాడి జరుపుతుండగా సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను బంధించాడు. ఈ దారుణం చివరికి పోలీసుల దృష్టికి రావడంతో కామాంధుడ్ని అరెస్టు చేశారు.