: తుని ఘటనలో విధ్వంసం సృష్టించిన వారిపై కేసులు ఎత్తివేయడం కుదరదు: చినరాజప్ప
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుని ఘటనలో కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేసులు ఎత్తివేయాలనడం సరికాదని అన్నారు. విధ్వంసం సృష్టించిన వారిపై కేసులు ఎత్తివేయడం కుదరదని ఆయన చెప్పారు. ప్రభుత్వం తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ వర్గ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. ముద్రగడ దీక్షకు దిగడం భావ్యం కాదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.