: ఓడిన మంత్రులకు ఝలక్కిచ్చిన జయలలిత!... పార్టీ పదవుల నుంచి తప్పించిన వైనం!
మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన మాజీ మంత్రులు, పార్టీ నేతలపై అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొరడా ఝుళిపించారు. మొన్నటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగిన నాథమ్ ఆర్ విశ్వనాథన్ దిండిగల్ పార్టీ కార్యదర్శి పదవిని కోల్పోయారు. ఇక పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉన్న మాజీ మంత్రులు పొన్నయన్, పళనియప్పన్, పర్నుతి రామచంద్రన్, మోహన్ లను ఆ పదవుల నుంచి జయ తప్పించారు. ఇక తన నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జయలలిత ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ను కూడా తేని జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు.