: కిర్లంపూడి రావద్దు!... కంచం, గరిట పట్టండి!: కాపులకు ముద్రగడ పిలుపు
కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయడంతో పాటు తుని విధ్వంసకారులుగా పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం... తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో కొద్దిసేపటి క్రితం ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు ఓ పిలుపునిచ్చారు. తన దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కూడా కిర్లంపూడి రావద్దని పిలుపునిచ్చిన ముద్రగడ.. ఆయా ప్రాంతాల్లో మునుపటిలాగే కంచం, గరిట పట్టి శబ్దం చేస్తూ నిరసన తెలపాలని కోరారు. అదే సమయంలో తాను సంప్రదింపులకు కూడా సిద్ధంగా లేనని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.