: వెంకయ్య ప్రెస్ మీట్లోకి చొచ్చుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు!


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న వెంకయ్య... నిన్న ఆ రాష్ట్రంలోని రాజ్ కోట్ సర్క్యూట్ హౌస్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడకు మీడియా ప్రతినిధులు చేరుకోగా, వెంకయ్య మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. పోలీసులు తేరుకునేలోగానే వారు మీడియా సమావేశంలోకి చేరుకుని వెంకయ్యను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అక్కడ కలకలం రేగింది. వెనువెంటనే స్పందించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాస్త ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో వెంకయ్య మీడియా సమావేశం కొనసాగింది.

  • Loading...

More Telugu News