: 'మై డార్లింగ్ డాటర్'తో కలసి డిన్నర్ చేశాను: సినీ నటుడు ప్రకాష్ రాజ్
తన కూతురితో కలిసి డిన్నర్ చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. పిల్లలతో కలిసి ఎదగడంలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నానంటూ ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘డిన్నర్ విత్ మై డార్లింగ్ డాటర్...’ అని చేసిన ట్వీట్ తో పాటు తన కూతురితో కలిసి ఉన్న ఒక ఫొటో, కూతురొక్కటే నవ్వుతున్న మరో ఫొటోతో పాటు ఆహారపదార్థాలతో ఉన్న పాత్రలను కూడా పోస్ట్ చేశారు.